Psycho Rambabu arrested in Visakha
mictv telugu

విశాఖలో సైకో రాంబాబు అరెస్ట్.. సంచలన విషయాలు వెల్లడి

August 16, 2022

Psycho Rambabu arrested in Visakha

ఏపీ ఆర్దిక రాజధాని విశాఖలో వరుస హత్యలు చేసిన సైకో రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సవాల్‌గా మారిన వరుస హత్యల మిస్టరీ వీడింది. భార్య ప్రవర్తన వల్ల సైకోగా మారిన రాంబాబు.. ఆడవాళ్లపై కోపంతో చంపడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని నగర సీపీ మంగళవారం వెల్లడించారు. మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ‘2018లో రాంబాబు భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రాంబాబు తట్టుకోలేకపోయాడు.

భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇద్దరు పిల్లలు అతడిని దగ్గరకు రానివ్వలేదు. తర్వాత హైదరాబాద్ వెళ్లి రియల్ ఎస్టేట్ ఏజెంటుగా పనిచేయగా, అక్కడ మోసానికి గురవడంతో కొన్ని రోజులు ఆటో నడిపాడు. తర్వాత ఆడవాళ్లను చంపడమే లక్ష్యంగా పెట్టుకొని వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఈ నెల 6న ఓ భవన నిర్మాణం వద్ద కాపలాదారులుగా ఉన్న దంపతులను చంపాడు. హత్య చేసిన తర్వాత అందులో మహిళలు ఉన్నారా? లేదా? అని వారి ప్రైవేట్ పార్టులు పట్టుకొని చూసేవాడు. తర్వాత కాలితో తన్ని వెళ్లిపోతాడు. ఈ నెల 14న సుజాతనగర్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంటుకి ఎదురుగా రేకుల షెడ్డులో నివాసం ఉంటున్న దేవుడి భార్య లక్ష్మిని నిద్రలో ఉండగా, ఇనుపరాడ్డుతో కొట్టి హతమార్చాడు. ఆలయాలు, ఫంక్షన్ హాళ్ళలో తింటూ కాలక్షేపం చేసేవాడు. గతంలో అద్దె ఇంట్లో ఉంటూ క్షుద్ర పూజలు నిర్వహించగా, యజమాని ఇల్లు ఖాళీ చేయించాడు. రాంబాబు వద్ద సెల్‌ఫోన్ లేకపోవడంతో పట్టుకోవడం కొంత కష్టమైంది. కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంద’ని సీపీ శ్రీకాంత్ వెల్లడించారు.