30 రేప్‌లు, 15 హత్యలు.. చివరకు గొంతుకోసుకుని చచ్చాడు - MicTv.in - Telugu News
mictv telugu

30 రేప్‌లు, 15 హత్యలు.. చివరకు గొంతుకోసుకుని చచ్చాడు

February 28, 2018

వెయ్యి గొడ్లను గొడ్లను తిన్న రాబందు.. ఒక్క గాలివానకు చస్తుందని సామెత. ఎన్నో ఘోరాలు నేరాలు చేసిన ఒక పైశాచిక సైకో… చివరి అంతే ఘోరంగా గొంతుకోసుని చనిపోయాడు. 30 మంది మహిళలపై అత్యాచారాలు, 15 హత్యలు, దొంగతనాలు, జైళ్ల నుంచి తప్పించుకోవడం వంటి ఎన్నో కేసుల్లో దోషిగా తేలిన శంకర్ అలియాస్ జైశంకర్(37)ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి బెంగళూరు పరస్పన అగ్రహార జైల్లో భోజనం ప్లేట్‌ను ఆయుధంగా మార్చుకుని గొంతుకోసుకున్నాడు. పేట్‌ను సగానికి విరిచేసే అరగదీసి కోసుకున్నాడు.

జైలు సిబ్బంది వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావంతో మంగళవారం వేకువజామున చనిపోయాడు. ఏళ్ల తరబడి జైలుజీవితం, కేసుల విచారణతో శంకర్ ఆగ్రహంతో ఉండేవాడు. తోటి ఖైదీలకు హాని చేస్తాడని అతన్న ప్రత్యేక గదిలో ఉంచారు. శంకర్ జైలు నుంచి  పారిపోవడానికి గోడ ఎక్కి కిందపడటంతో నడుం దెబ్బతింది. ఈ అన్ని కారణాలతో అతని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. అతని స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఈడప్పాడి గ్రామం.

నేరాల చిట్టా..

లారీ క్లీనర్‌గా పనిచేసిన శంకర్‌కు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కన్నుగానని కామం అతణ్ని నేరాల బాటపట్టించింది. వేశ్యల వద్దకుక వెళ్లి కోరిక తీర్చుకున్నాక వారి చంపేశాడు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణాల్లో ఘోరాలు చేశాడు. 2009లో తమిళనాడులో మహిళా కానిస్టేబుల్‌పై హత్యాచారానికి పాల్పడ్డాడు. శంకర్‌కు కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, హిందీ భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. భాష ద్వారానే మహిళలను పరిచయం చేసుకుని నమ్మించి హత్య చేసేవాడు. తెలుగు, తమిళం, కన్నడం సహా ఐదు భాషలు  మాట్లాడే శంకర్ మహిళలను నమ్మించి, అవసరం తీరాక చంపేసేవాడు.