PT Usha Chairs Rajya Sabha Proceedings
mictv telugu

పీటీ ఉష ఖాతాలో మరో మైల్ స్టోన్

February 9, 2023

PT Usha Chairs Rajya Sabha Proceedings, Hopes To Create Milestones

పరుగుల రాణి ఖాతాలో మరో మైలు రాయి వచ్చి చేరింది. పీటీ ఉష రాజ్యసభ వైస్ ఛైర్ పర్శన్ గా ఉన్నారు. అయితే ఈరోజు రాజ్యసభలో స్పీకర్ ఛైర్ లో ప్రొసీడింగ్స్ నిర్వహించి మరో మైల్ స్టోన్ ను కూడా అధిగమించారు. ఛైర్మన్, వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఇవాళ సభకు రాలేదు. దాంతో సభాకార్యక్రమాలను ఉష అడ్రస్ చేశారు.

గ్రేట్ పవర్ ఇన్వాల్స్ గ్రేట్ రెస్పాన్స్ బిలిటీ అన్న ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ మాటలు నిజమనిపించాయి నాకు రాజ్యసభ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అన్నారు పీటీ ఉష. తన జర్నీలో ఇదో మరుపురాని సంఘటన అంటున్నారు. రాజ్యసభ కార్యక్రమాలకు సంబంధించిన చిన్న క్లిప్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు పీటీ ఉష. ఆమె పోస్ట్ కు మంచి స్పందన కూడా వస్తోంది. చాలా గర్వంగా ఉందని, ఆమెను చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారని కామెంట్లు పెడుతున్నారు. ఇలాగే మరిన్ని విజయాలను సాధించుకోవాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.

లాస్ట్ డిసెంబర్ లోనే పీటీ ఉష రాజ్యసభ ఛైర్ పర్శన్ గా ఎన్నికయ్యారు. సభలోని ఎంపీలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్న మొదటి ఛైర్ పర్శన్ కూడా ఈమెనే. అసలు ఛైర్ పర్శన్ జగదీప్ ధన్కర్ హాజరుకానప్పుడు పీటీ ఉష సభా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉష ఉన్నారు.