జియో చేతికి పబ్జీ.. భారత్‌లోకి రీ ఎంట్రీ! - MicTv.in - Telugu News
mictv telugu

జియో చేతికి పబ్జీ.. భారత్‌లోకి రీ ఎంట్రీ!

September 26, 2020

 

భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ చైనీయ పబ్జీ మొబైల్ గేమ్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ గేమ్ మళ్ళీ భారత్‌లోకి రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పబ్జీ కార్పొరేషన్ జియోతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తోందని కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పబ్జీ కార్పొరేషన్‌తో జియో చర్చలు ప్రారంభ దశలో ఉన్నాయని తెలుస్తున్నాయి. 

ఈ ఒప్పందం విషయంలో ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇరు సంస్థలకు 50 శాతం వాటాలు, నెలవారీ యూజర్ల ఆధారంగా కార్పొరేషన్‌కు ఆదాయం వంటి విషయాలపై రెండు సంస్థల ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారని సమాచారం. రిలయన్స్ గేమింగ్ మార్కెట్లోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో మరో నిషేధిత అప్లికేషన్ టిక్ టాక్ ను కూడా రిలయన్స్ కొనుగోలు చేస్తుందని వార్తలు వచ్చాయి.