పబ్‌జీ వ్యసనానికి మరో బాలుడు బలి - MicTv.in - Telugu News
mictv telugu

పబ్‌జీ వ్యసనానికి మరో బాలుడు బలి

July 13, 2020

pug01

పబ్‌జీ..అనతి కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొందింది. కొన్ని కోట్ల మంది ఈ ఆన్‌లైన్ గేమ్ కు వ్యసనపరులు అయ్యారు.‌ ఇప్పటికే ఈ గేమ్ కోసం ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో బాలుడు ఈ గేమ్ కు బలయ్యాడు. చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనగర్ కాలనీరి చెందిన శ్యామ్ ప్రసాద్ (14) అనే బాలుడు తన తండ్రి మొబైల్ ఫోన్‌ను తీసుకుని రోజంతా పబ్‌జీ ఆడేవాడని, దీంతో చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు కోప్పడ్డారు. 

దీంతో అతడు మనస్తాపానికి లోనై.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, అతన్ని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు. ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో మార్గమధ్యంలోనే శ్యామ్‌ తుది శ్వాస విడిచాడు. శ్యామ్ ప్రసాద్ స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు.