నేటి నుంచి పబ్‌జి గేమ్‌పై పూర్తి నిషేధం - MicTv.in - Telugu News
mictv telugu

నేటి నుంచి పబ్‌జి గేమ్‌పై పూర్తి నిషేధం

October 30, 2020

PUBG Mobile Will No Longer Work in India.jp

చైనాకు చెందిన పబ్‌జి మొబైల్ గేమ్‌‌ను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి తెల్సిందే. ఇప్పటికే ఈ గేమ్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఆప్ స్టోర్‌ల నుంచి తొలగించారు. అయినప్పటికీ ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నవాళ్ళు ఆ గేమ్ ఆడగలుగుతున్నారు. అయితే నేటి నుంచి పబ్‌జిపై పూర్తి నిషేధం అమలు కానుంది. 

నిషేధానికి ముందు డౌన్ లోడ్ చేసుకున్నవాళ్ళు కూడా ఈ రోజు నుంచి ఆ గేమ్ ఆడలేరు. సైబర్ సెక్యూరిటీ సమస్యలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పబ్ జి గేమ్‌ను అక్టోబరు 30 వతేదీ నుంచి దేశంలో నిలిపివేస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. భారత-చైనా సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. దాంతో భారత ప్రభుత్వం చైనాకు చెందిన 100కు పైగా యాప్‌లను నిషేధించింది. చైనా యాప్స్ భారతదేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే అనువర్తనాలను ఐటీ మంత్రిత్వశాఖ నిషేధం విధించింది.