ఇప్పటి వరకు టిక్‌టాక్ ప్రేమలు, పెళ్లిల గురించే విన్నాం. కానీ తాజాగా పబ్జీ ప్రేమలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఆన్లైన్ యుద్ధ భూమిలో ఓ యువతి, యువకుడు ప్రేమలో పడ్డారు. అంతటితో ఆగిపోకుండా అది కాస్తా పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. తమిళనాడులోని తిరువత్తర్లో ఇది జరిగింది.
బాబిష అనే 20ఏళ్ల యువతి లాక్ డౌన్ సమయంలో ఇంట్లో బోర్ కొట్టి ఆన్లైన్ గేమ్ ఆడుతూ సమయం గడిపేది. ఇలా పబ్జీ ఆడటం అలవాటు కావడంతో ఆమెకు అజిత్ ప్రిన్స్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి ప్రతిరోజూ ఆటుకునే వారు. ఇది కాస్తా ప్రేమగా మారడంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో బాబిష అజిత్ వద్దకు వెళ్లిపోయింది. అమ్మాయి కుటుంబ సభ్యులు కిడ్నాప్ కేసు పెట్టడంతో పోలీసులు వారి ఆచూకీ కనుక్కోగా పెళ్లైన విషయం వెలుగులోకి వచ్చింది. చేసేదేమి లేక పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అజిత్ తో పాటు పంపించేశారు.