చేపల కోసం వల వేస్తే రాకెట్ వచ్చిపడింది - MicTv.in - Telugu News
mictv telugu

చేపల కోసం వల వేస్తే రాకెట్ వచ్చిపడింది

December 4, 2019

ISRO Rocket01

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి వలవేస్తే జాలర్లకు ఊహించని పరిణామం ఎదురైంది. వల లాగుతుంటే బరువుగా ఉండటంతో పెద్ద పెద్ద చేపలు పడి ఉంటాయని అంతా అనుకున్నారు. తీరా పైకి తీసి చూస్తే పీఎస్ఎల్వీ రాకెట్ బూస్టర్ దానికి చిక్కింది. పుదుచ్చేరి సముద్ర జలాల్లో ఈ ఘటన జాలర్లకు ఎదురైంది. ఎలాగోలా నాలుగు పడవలకు దాన్ని తాళ్లతో కట్టి ఒడ్డుకు చేర్చారు. 

సముద్ర జలాల్లో 10 నాటికల్ మైళ్ల దూరంలో వలవేయగా 13 మీటర్ల పొడవు, మీటరు వెడల్పు,16 టన్నుల శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ శకలం వలకు చిక్కింది. ఇది 23 ఫిబ్రవరి 2019లో శ్రీహరి కోట కేంద్రంగా ప్రయోగించిన రాకెట్‌గా అధికారలు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే షార్ అధికారులు అక్కడికి చేరుకొని దాన్ని ఓ పెద్ద లారీలో తరలించుకొని వెళ్లారు. కాగా రాకెట్ శకలాల వల్ల తమ వలలు పాడైపోయాయని జాలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ. 20 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.