Home > Featured > లింకు పెట్టుకోడానికి హిందీ నేర్చుకోవాలి.. కిరణ్ బేదీ

లింకు పెట్టుకోడానికి హిందీ నేర్చుకోవాలి.. కిరణ్ బేదీ

Kiran Bedi.....

దేశమంతా హిందీ మాట్లాడాలని, ఒకే దేశం ఒకే భాష అని బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం సద్దుమణగక ముందే పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేదీ తేనెతుట్టె కదిల్చారు. దక్షిణ భారతీయులు హిందీ నేర్చుకోవాలని, అందువల్ల వాళ్ల సంస్కృతేమీ దెబ్బతినని చెప్పుకొచ్చారు. ‘ఢిల్లీలోని నాయకులతో అనుకోండి, కేంద్ర ప్రభుత్వంతో అనుకోండి.. ఒక అనుబంధాన్ని కలిగి ఉండాలంటే మీరంతా హిందీ నేర్చుకోవాలి. నేను కూడా ట్రాన్స్‌టేటర్‌ను వాడుకుంటున్నాను..’ అని అన్నారు.

దేశంలోని భిన్నప్రాంతాల ప్రజల మధ్య అనుసంధానం లేదని, హిందీ కాకుండా ఇంగ్లిష్ ప్రజలను అనుసంధానం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రజలు ఉత్తరాది నేతల ప్రసంగాలను అనువాదాల ద్వారా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. తాను చిన్ని పదాలు(తమిళం) నేర్చుకుంటున్నానని, అనువాదం కోసం త్వరలో సాఫ్ట్వేర్ వస్తుందని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారు.

Updated : 16 Sep 2019 7:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top