Home > రాజకీయం > వార్ ముదిరింది..హిట్లర్ దాకా వెళ్లింది..!

వార్ ముదిరింది..హిట్లర్ దాకా వెళ్లింది..!

గవర్నర్ వర్సెస్ రాష్ట్రపభుత్వం… వీరి అభిప్రాయ బేధాలు వచ్చాయంటే అంతే..ఎవరు తగ్గరు..ఎవరి రేంజ్ లో వారు రెచ్చిపోతారు. ఇక కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం..రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటే కస్సుబుస్సే. చాన్స్ దొరికిందంటే ఆడుకునేందుకు గవర్నర్లు ప్రయత్నిస్తుంటారు. గవర్నర్ తీరు బాగోలేదంటూ కాంగ్రెస్సోళ్లు ఆందోళనకు దిగడం కామన్..కానీ పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ, కాంగ్రెస్‌ సర్కార్ మధ్య వివాదం హద్దులు దాటింది. వయా హిట్లర్ మీదుగా కాళి దాకా వెళ్లింది.

పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ, కాంగ్రెస్‌ ప్రభుత్వం మధ్య విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమెను మరోచోటుకు బదిలీ చేయాలంటూ అప్పట్లో కాంగ్రెస్‌ నేతలు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత కొంతకాలం కోల్డ్ వార్ నడిచినా…బయటపడలేదు.. ఇప్పుడు ముగ్గురు బీజేపీ నేతల్ని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి కిరణ్ బేడీ నామినేట్ చేయండంతో వివాదం రాజుకుంది. దీనిపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొందరు కాంగ్రెస్‌ కార్యకర్తలు కిరణ్‌బేడీని జర్మనీ నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌తో పోలుస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు కిరణ్‌బేడీ ముఖాన్ని హిట్లర్‌ ముఖంలా మార్ఫింగ్‌ చేసిన పోస్టర్లను అంటించారు. స్థానిక మీడియా పత్రికల్లో ప్రచురితమైన ఈ పోస్టర్లను కిరణ్‌ బేడీ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఇందులో కిరణ్‌ ముఖానికి హిట్లర్‌ మీసాన్ని అంటించి మార్ఫింగ్‌ చేశారు. మరో పోస్టర్‌లో కిరణ్‌బేడీని వెంబడించి దాడి చేస్తున్నట్లుగా వ్యంగ్య చిత్రాల్ని ఉంచారు.

అటు గవర్నర్ కిరణ్ బేడీ నిర్ణయాన్ని డీఎంకే, వామపక్ష పార్టీలు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రస్తుతం హిట్లర్ దాకా వెళ్లిన ఈ వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి మరి.

-

Puducherry ,L-G Kiran Bedi,Adolf Hitler,Goddess Kali

Updated : 21 July 2017 5:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top