థాంక్యూ..కానీ అలా చేయకండి..అభిమానులతో పూజా హెగ్డే - MicTv.in - Telugu News
mictv telugu

థాంక్యూ..కానీ అలా చేయకండి..అభిమానులతో పూజా హెగ్డే

January 16, 2020

 

bvb vgbg

సినీ సెలబ్రెటీలను కలుసుకోవడం కోసం అభిమానులు పడే ఆరాటం అంతా ఇంతా కాదు. సెల్ఫీలు దిగాలని, ఒకసారి అయినా కలవాలని తహతహలాడుతూ ఉంటారు. అలాగే హీరోయిన్ పూజా హెగ్డే కోసం ఓ ఫ్యాన్ ఏకంగా 5 రోజుల పాటు ఆమె ఇంటి వద్ద వేచి ఉన్నాడు. ఫుట్‌పాత్‌పైనే ఉంటూ ఆమెను కలిసేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ విషయం తెలిసిన ఆమె వెంటనే స్పందించి అతన్ని కలుసుకుంది. కొంతసేపు మాట్లాడి సెల్పీ దిగి పంపించింది. ఈ వీడియోను తన అభిమానులతో పంచుకుంది. 

భాస్కర్‌రావు అనే వ్యక్తి ఆమెను కలిసేందుకు ముంబై వెళ్లాడు. కానీ ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా అపాయింట్‌మెంట్ దొరకలేదు. దీనిపై పూజా హెగ్డే ఈ విధంగా స్పందించారు. ‘ఐదు రోజులు నా కోసం వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. నా కోసం అభిమాని ఇలా కష్టపడటం బాధగా అనిపించింది. నా కోసం వచ్చిన అభిమాని ఇలా రోడ్లపై ఉండటం సరికాదు.మీ అభిమానులే నా బలం లవ్యూ’అంటూ  వీడియోతో పాటు మెసేజ్ పోస్టు చేసింది. అభిమానుపై పూజకు ఉన్న ప్రేమ చూసి అంతా సంబరపడిపోతున్నారు. కాగా ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ పూజా హెగ్డే బిజీగా అయిపోయింది. వరుస విజయాలతో అభిమానులను కూడా సంపాదించుకుంటోంది.