పులసకు ఫుల్ గిరాకీ.. రూ.21 వేలకు దక్కించుకున్న వైసీపీ నేత - MicTv.in - Telugu News
mictv telugu

పులసకు ఫుల్ గిరాకీ.. రూ.21 వేలకు దక్కించుకున్న వైసీపీ నేత

September 21, 2020

nbgcn

పుస్తెల తాడు అమ్మి అయినా పులస తినాలి అనే సామెత ఉభయ గోదావరి జిల్లాలో తరుచూ వినిపిస్తోంది. ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి గోదావరి జలాల్లోకి వచ్చే ఈ చేప అంటే అందరికి చాలా ఇష్టం. దీన్ని రుచి చూసేందుకు జనం ఎగబడి మరీ కొనుక్కుంటారు. ఇవి ఒకసారి వలకు చిక్కితే మత్స్యకారులకు కాసుల వర్షం కుసిసినట్టే. వేలు పోసి వీటిని తీసుకెళ్తారు. ఈ సీజన్‌లో తొలి పులస తూర్పుగోదావరి జిల్లాలో చిక్కింది. 

జిల్లాలో సముద్రానికి ఆనుకొని ఉన్న పాశర్లపూడి మత్స్యకారులకు దీన్ని పట్టుకున్నారు. పులస పడిందనే వార్తతో జనం దాని కోసం ఎగబడ్డారు. దాదాపు రెండున్న కిలోల బరువు ఉన్న ఈ చేపను స్థానిక వైసీపీ నేత దక్కించుకున్నారు. ఏకంగా రూ. 21 వేలు పెట్టి దాన్ని కొనుగోలు చేశాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మల కొండలరావు దీన్ని తీసుకెళ్లారు. భారీ ధరకు పులస అమ్ముడు కావడంతో మత్స్యకారులు ఆనందంలో మునిగిపోయారు.