పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి. రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కూతురు శ్రీవిద్యారెడ్డిలు తనను వేధిస్తున్నారని, వారి నుంచి తనను కాపాడాలని ఆ ఇంటి కోడలు, ఏక్ నాథ్ రెడ్డి భార్య ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు లేఖ రాశారు. గత రెండేళ్లుగా ఈ ముగ్గురు తనను, తన 8 ఏళ్ల కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారని, గతంలో తనను వరకట్నం కోసం వేధించారని అందులో పేర్కొన్నారు. గతంలో తనను బయటికి రాకుండా రాత్రికి రాత్రే ఇంటి ముందు గోడ కట్టారని, దాంతో గోడను కూల్చేయాలని కోర్టు ఆదేశించిందని వివరించారు. తన అత్త భారతిరెడ్డిపై హైదరాబాదులో భూకబ్జా కేసులు ఉన్నాయని కూడా ఆమె లేఖలో రాశారు. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్ధం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు లేఖ రాస్తున్నానన్నారు. కాగా, మైనింగ్ వ్యాపారి అయిన కేఆర్ఎం రెడ్డి కుమార్తె ప్రజ్ఞారెడ్డికి 2014లో ఏక్ నాథ్ రెడ్డితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంతకాలానికే వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో ప్రజ్ఞారెడ్డి పంజాగుట్ట పీఎస్ లో గృహహింస చట్టం కింద కేసు వేయడం తెలిసిందే. రాష్ట్రపతికి లేఖ రాసిన పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని కోడలు ప్రజ్ఞారెడ్డి
ఇవి కూడా చదవండి :
నా తమ్ముడే స్వామి ఎవరో కాదు.. జగన్ వీడియోపై లోకేష్ సెటైర్\
2022 తెలంగాణ రౌండప్.. మునుగోడు, ఢిల్లీ మరెన్నో..