పుల్వామా నరమేధం, మన దేశానికి పండగ.. పాక్ ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

పుల్వామా నరమేధం, మన దేశానికి పండగ.. పాక్ ఎంపీ

March 16, 2019

40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న పుల్వామా ఉగ్రదాడి వెనక పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థల హస్తముందని భారత్ ఆధారాలతో సహా వెల్లడించండం తెలిసిందే. దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ సంస్థ ప్రకటించింది. ఆ దాడి కశ్మీర్ స్వతంత్ర యోధుడి సాహసం అని పాక్ పత్రికలు కూడా రెచ్చగొట్టేలా వార్తలు రాశాయి. తాజాగా ఆ దేశ ఎంపీ ఒకడు మరింత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. పుల్వామా దాడి పాక్ చరిత్రంలో అత్యంత శుభ ఘడియ అని అన్నాడు.

Pulwama terror attack was Pakistan's finest hour: Pakistani Senator Mushahid Hussain Sayed

సెనేటర్ ముషాహిద్ హుసేన్ సయీద్ ఓ చర్చాకార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘నా దృష్టిలో 1998నాటి అణు పరీక్షల తర్వాత పుల్వామా దాడి పాకిస్తాన్‌లో అత్యంత శుభ సమయం.. ’ అని అన్నాడు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన సయీద్.. పాకిస్తాన్-చైనా ఇన్ స్టిట్యూట్ అండ్ సెనేట్ ఫారిన్ ఎఫైర్స్ కమిటీ హోదాలో ఈ ప్రసంగం చేశాడు.