గుమ్మడికాయ పడవతో ఫోజు కొట్టాడు.. చివరికి ఇలా.. - MicTv.in - Telugu News
mictv telugu

గుమ్మడికాయ పడవతో ఫోజు కొట్టాడు.. చివరికి ఇలా..

October 23, 2019

Posted by Christin Ownby on Monday, 21 October 2019

గుమ్మడికాయ కనిపిస్తే దాన్ని కూర వండేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అమెరికాలోని టెన్ససీ ప్రాంతానికి చెందిన జస్టిన్ అనే వ్యక్తి మాత్రం వినూత్న ఆలోచన చేశాడు. ఓ భారీ గుమ్మడికాయను  పడవలా మార్చి దానితో ఓ కుంటలో సరదాగా షికారు చేశాడు. సుమారు 412.7 కిలోల బరువు ఉండే ఈ భారీ సైజు గుమ్మడికాయకు గుండ్రంగా రంధ్రం చేసి పడవలా మార్చాడు. ఆ తర్వాత తన పొలంలోని మడుగులోకి దిగి వీడియోలు, ఫొటోలకు పోజిచ్చాడు.

Posted by Christin Ownby on Monday, 21 October 2019

కొంత సేపు భాగానే రైడ్ చేసిన జస్టిన్‌కు దిగిపోదామనుకున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. ఆ గుమ్మడికాయ ఒక పక్కకు ఒరగడంతో అతడు నీటిలో పడిపోయాడు. అయితే కుంట పెద్దగా లోతు లేకపోవడంతో మామూలుగా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. చివరికి అది కాస్త అందులో ఉన్న చేపలకు ఆహారంగా మారిపోయింది. ఈ వీడియోను జస్టిన్ భార్య క్రిస్టన్ ఓన్‌బే తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. జస్టిన్ తన పొలంలో గుమ్మడి కాయలు పండిస్తుంటారు. అయితే గత నాలుగేళ్లుగా ఓ భారీ గుమ్మడి కాయలను పెంచాడు. దాన్ని ఇలా కోసి పడవాల తయారు చేసి సరదాగా గడిపాడు.