పునర్నవి గేమ్.. అతడు కాబోయే భర్త కాదు! - MicTv.in - Telugu News
mictv telugu

పునర్నవి గేమ్.. అతడు కాబోయే భర్త కాదు!

October 29, 2020

సెలబ్రిటీలు చేసినా విశేషమే. వాళ్లు కూడా తాము ఎప్పుడూ వార్తల్లో ఉండాలని కొత్త కొత్త ఎత్తులు వేస్తుంటారు. ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పకుండా ఉత్కంఠ కొనసాగిస్తూ ఓ అభిమానులతో ఓ ఆట ఆడుకుంటారు. బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి పెళ్లికి సిద్ధమైందని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ‘ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్’ అని ఓ ఫొటోను ఆమె నిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

 

 

View this post on Instagram

 

@punarnavib She said yes?? Naaaice ? Can’t wait to tell you all about the big day tomorrow ?

A post shared by Udbhav Raghunandan (@itsudbhav) on

అందులో ఆమె ఉంగరం పెట్టుకుని ఉన్న ఓ యువకుడి చెయ్యి కూడా ఉంది. దీంతో ఆమెకు నిశ్చితార్థం అయపోయిందని అభిమానులు భావించారు. 

ఈ రోజు పున్ను అతడి ఫొటోలను బయటపెట్టింది. అతనితో సన్నిహితంగా ఉండడంతో అతడే ఆమె కాబోయే భర్త అని అభిమానులు ఊహించారు. అయితే ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించడం లేదు. ‘నేను అవును అని చెప్పాల్సి వచ్చింది. ఉద్భత్ రఘునందన్, నేను మా బిగ్ డే గురించి రేపు చెబుతాం’ మరింత ఊరించింది. మరోపక్క సదరు రఘనందన్ కూడా నేనేం తక్కువా అంటూ పునర్నవితో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.  ‘పునర్నవి యస్ చెప్పింది. ఎంతో సంతోషంగా ఉంది. ఆ బిగ్ డేపై చెప్పడానికి ఆత్రంగా ఉంది’ అని అన్నాడు. రఘనందన్ కూడా నటుడు, యూబ్యూబర్ కావడం విశేషం. వీరిద్దరి పరస్పర ప్రకటలు చూస్తుంటే వీరిద్దరూ ఓ వెబ్ సిరీస్ కోసం ఇలా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు ఇటీవల ‘ఆహా’ యాప్ కోసం ఒక వెబ్ సిరీస్‌లో నటించారు. ‘పర్మనెంట్ రూంమేట్స్’ అనే హిందీ సిరీస్‌కు ఇది కాపీ.