బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రాం ద్వారా వెల్లడించింది. ‘ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్’ అని ఓ ఫొటోను పోస్టు చేసింది. దాంట్లో ఆమె చేతి వేలికి ఓ రింగ్ కనిపిస్తుంది. ఆమె చేతిని మరొకరు పట్టుకొని ఉంటారు. దీంతో అంతా ఆమెకు విషెష్ చెబుతున్నారు. తనకు కాబోయే భర్త ఎవరు అనేది మాత్రం చెప్పలేదు. ఫొటోలో కూడా అతడి ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడింది. పునర్నవీ చేసుకోబోయే వ్యక్తి ఎవరు అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో పునర్నవి చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోకి ఆఫర్ రావడంతో ఫేం వచ్చింది. సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లీ గంజ్‌తో ఆటలో భాగంగా లవ్ ట్రాక్ నడిపింది. వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉండటం చూసి అంతా పెళ్లి చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఇంతలోనే పునర్నవీ తన పెళ్లి విషయం చెప్పి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ పెళ్లి వేడుక ఎప్పుడు జరుగుతుంది, ఎవరితో జరుగుతుంది అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది.