జొమాటోలో రూ. 28 లక్షల ఫుడ్ తెప్పించుకున్నాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

జొమాటోలో రూ. 28 లక్షల ఫుడ్ తెప్పించుకున్నాడు..

December 30, 2022

ఇల్లు, ఆఫీసు కదలకుండా తిండి తెప్పించుకుని, గుటకాయ స్వాహా చేసే సంస్కృతికి పెరిగిపోయి చాలా సంవత్సరాలే కావొస్తోంది మనదేశంలో. ‘ఏదైనా హోటల్ వెళ్లి తినొద్దామా?’ అని అడిగినవాడిని, ఆమెను వెర్రివాడిని, వెర్రిదాన్ని చూసినట్లు చూసేవాళ్లు చాలామందే ఉన్నారు. మహానగరాల్లోనే కాకుండా చిన్నచిన్న టౌన్లలొనూ ఇదే సీన్. జొమాటో, స్విగ్గీ వగైరా యాపుల్లో యూజర్లు ఇస్తున్నర ఫుడ్ ఆర్డర్ల విలువ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.

జొమాటో విడుదల చేసిన 2022 నివేదికల్లో షాకిగ్ విషయాలు బోలెడు ఉన్నాయి. నివేదిక ప్రకారం.. ఈ ఏడాది యూజర్లు ఎక్కువగా తెప్పించుకున్న ఫుడ్డులో ఎప్పట్లాగే బిర్యానీదే అగ్రస్థానం. తర్వాతి స్థానంలో మసాలా దోసె, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా వంటి ఉన్నాయి. మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఓ ఆసామి ఈ ఏడాది రూ. 28 లక్షల విలువైన నానా ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి అగ్రస్థానంలో నిలబడ్డాడు. ఇంకొకరు పిజ్జాల కోసం రూ. 25 వేల ట్రాన్సాక్షన్ జరిపాడు. ఢిల్లీకి చెందిన ఓ మనిషి ఏకంగా 3300 ఆర్డర్లు ఇచ్చాడు. మరో మహానుభావుడు వెయ్యికిపైగా కేకులు తెప్పించుకున్నాడు. కోవిడ్ నుంచి కోలుకోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం, బయట ట్రాఫిక్ కష్టాల వల్ల ఆన్‌లైన్ ఫుడ్డుకు డిమాండు పెరుగుతున్నట్లు విశ్లేషకుల అంచనా.