పరిగెత్తే గుర్రాన్ని ఎక్కబోయాడు... దూల తీరింది (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పరిగెత్తే గుర్రాన్ని ఎక్కబోయాడు… దూల తీరింది (వీడియో)

December 9, 2019

Pune 02

‘బెన్‌హర్’ లాంటి హాలీవుడ్ సినిమాలే కాదు, మగధీర, బాహుబలి వంటి టాలీవుడ్ సినిమాల్లో గుర్రపు స్వారీలు ఎంత అద్భుతంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. సినిమాల్లో నటీనటులు గుర్రాలతో చేసిన విన్యాసాలు చూసి కొందరు బయటకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు బెడిసికొట్టి ప్రమాదంలో పడతారు. తాజాగా మహారాష్ట్రలోని పుణేలో ఇలాంటి ఓ సంఘటనే చోటుచేసుకుంది. పూణేలో ఓ గుర్రపు బండి నడిపే వ్యక్తి సినిమాలో లాగా గుర్రపు బండి ఎక్కడానికి ప్రయత్నించాడు. గుర్రాన్ని పట్టుకోవడంలో విఫలమైన కిందపడి గాయాలపాలయ్యాడు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

జితేంద్ర కదమ్ అనే వ్యక్తి తన గుర్రం బండికి లైట్లు అమర్చాడు. సినిమాలో లాగ రన్నింగ్‌లో దానిని ఎక్కాలనుకున్నాడు. బండ్ గార్డెన్ బ్రిడ్జీ నుంచి గుర్రం బండిని వదిలాడు. గుర్రాలు వేగంగా పరిగెట్టడం ప్రారంభించాయి. బైక్‌పై తన ఇద్దరు మిత్రులతో వెళ్లి గుర్రం పిబండిని పట్టుకొని దానిపైకి ఎక్కాలనుకున్నాడు. గుర్రంపైకి ఎక్కే సందర్భంలో.. పట్టుదప్పి కిందపడిపోయాడు. దీంతో ఆయన పైనుంచి గుర్రం బండి వెళ్ళింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి మొబైల్‌లో చిత్రీకరించి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.