మళ్ళీ పది రోజుల సంపూర్ణ లాక్ డౌన్..ఎక్కడంటే? - MicTv.in - Telugu News
mictv telugu

మళ్ళీ పది రోజుల సంపూర్ణ లాక్ డౌన్..ఎక్కడంటే?

July 11, 2020

bbcvb

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. రోజుకి సగటున 25వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. మొత్తం రాష్ట్రం కాకపోయినా కనీసం కేసులు ఎక్కువగా ఉన్న నగరాల్లో అయినా సంపూర్ణ లాక్ డౌన్ పెట్టాలని చూస్తున్నాయి.

ఈ క్రమంలో దేశంలోనే కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూణెలో ఈ నెల 13 నుంచి 23వ తేదీ వరకు పూర్తి స్థాయిలో లాక్‌ డౌన్‌ ను విధించబోతున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్డ్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాల దుకాణాలు, మెడికల్ షాపులు, హాస్పిటల్స్, ఇతర అత్యవసర సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. పూణెలో ఇప్పటివరకు 34,399 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా మరణాల సంఖ్య 978కి పెరిగింది.