గోల్డెన్ మ్యాన్.. గోల్డ్ మాస్క్ - MicTv.in - Telugu News
mictv telugu

గోల్డెన్ మ్యాన్.. గోల్డ్ మాస్క్

July 4, 2020

Pune Man Made Gold Mask

ప్రపంచాన్ని కరోనా రక్కసి వణికిస్తోంది. మందులేని వ్యాధి కావడంతో ముందు జాగ్రత్త చర్యలను తప్పక పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని కోసం శానిటైజర్లు, మూతి,ముక్కును కప్పి ఉంచేలా మాస్కులను వాడుతున్నారు. ప్రతి ఒక్కరు విధిగా వీటిని వాడాలని ప్రభుత్వాలు కూడా సూచిస్తున్నాయి. దీంతో బయటకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరు బట్టతో తయారు చేసి మాస్క్ ధరించి వెళ్తున్నారు. ఎంతటి ధనవంతులైనా వీటిని వాడుతున్నారు. కానీ పూణేలోని ఓ వ్యక్తి మాత్రం భిన్నమైన మాస్క ధరించాడు. ఏకంగా బంగారంతో ప్రత్యేకంగా మాస్క్ తయారు చేయించుకొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. 

పింప్రి-చిన్చ్వాడ్  ప్రాంతానికి చెందిన శంకర్ కురాడే అనే వ్యక్తి బంగారంతో మాస్క్ తయారు చేయించుకున్నాడు. దీని కోసం 2.89 లక్షలు ఖర్చు చేశాడు. బయటకు వెళ్లిన ప్రతిసారి దీన్నే పెట్టుకుంటూ ఉన్నాడు. ఇది చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ బంగారు మాస్క్‌లో సన్నని రంధ్రాలు ఉండటంతో అతనికి శ్వాస తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు. కానీ అది ఎంత వరకు వైరస్‌ను కట్టడి చేస్తుందని అనేది మాత్రం ప్రశ్నార్థకమే. ఇప్పటి వరకు వైద్యులు కూడా ఎన్ 95, సర్జికల్ మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. మరి ఇలాంటి మాస్క్ వల్ల ఎంత ఉపయోగం అనేది మాత్రం తేలాల్సి ఉంది. కాగా శంకర్ కురాడే ఒంటిపై మాస్కుతో పాటు బంగారు గొలుసులు, ఉంగరాలు కలిపి దాదాపు 3 కిలోల వరకు బంగారు ఆభరణాలు ధరించి ఉండటం విశేషం. కాగా ఇప్పటి వరకు పింప్రి-చిన్చ్వాడ్ ప్రాంతంలో 3,284 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.