అమ్మవారికి 16 కేజీల బంగారు చీర.. - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మవారికి 16 కేజీల బంగారు చీర..

October 9, 2019

దసరా వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. ఉత్తరాదిలో దుర్గమ్మ విగ్రహాలను రకరకాలుగా అలంకరించారు. చంద్రయాన్ దుర్గమ్మ, బాలాకోట్ దాడుల దుర్గమ్మ అంటూ దేశభక్తిని కూడా జోడించారు. మరోపక్క.. మహారాష్ట్ర పుణేలోని శ్రీమహాలక్ష్మి అమ్మవారిని దసరా సందర్భంగా 16 కేజీల విలువైన బంగారు పట్టుచీరతో అలంకరించారు. జిగేలుమనే పసిసి కాంతిలో అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. 

ఈ ఆలయంలో ఏడాదికి రెండుసార్లు అమ్మవారి ఈ పట్టుచీరతో అలంకరిస్తారు. విజయదశమి రోజున, లక్ష్మీపూజ రోజు మహాలక్ష్మి నిజంగా లక్ష్మి దేవిలా వెలిగిపోతుంది. ఆ రెండు రోజుల్లో అమ్మవారికి దర్శించుకోడానికి భక్తులు పోటెత్తుతారు. ఈ చీరను ఎనిమిదేళ్ల కిందట తయారు చేశారు.