కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. పునీత్ తొలి జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వేల స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా వేసిన ప్రీమియర్ షోలో అభిమానులు ఎవ్వరూ కర్చీలో కూర్చోలేదు. అందరూ నిలబడే సినిమా చూశారు. ఇదికాక, ఈ వారంలో మరే సినిమా విడుదల చేయకూడదని కన్నడ మూవీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఐదు భాషల్లో విడుదలైన జేమ్స్ చిత్రం అభిమానులకు అలరిస్తుందని నమ్మకంతో ఉన్నారు కన్నడ చిత్ర పరిశ్రమ వాళ్లు. కాగా, అక్టోబర్ 29న పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడంత తెలిసిందే. అయితే ఆయన చనిపోయాడన్న సంగతి పునీత్ మేనత్త నాగమ్మకు ఇప్పటివరకూ చెప్పలేదంట. పునీత్ అంటే ఆమెకు చాలా ఇష్టం అనీ, నాగమ్మ పునీత్ ఎక్కడ అని అడిగితే అవుట్ డోర్ షూటింగ్లో ఉన్నాడంటూ చెప్పుకొస్తున్నారు కుటుంబసభ్యులు. బయటివారు ఎవరైనా ఇంట్లోకి వస్తే సాధ్యమైనంతవరకు పునీత్ ప్రస్తావన ఆమె ముందు తేకుండా జాగ్రత్తపడుతున్నారంట.