Puneeth Rajkumar to have a satellite named after him
mictv telugu

కేజీఎస్ 3 ఉపగ్రహానికి.. పునీత్ రాజ్ కుమార్ పేరు

November 4, 2022

దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. పునీత్‌కు కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ‘కన్నడ రత్న’ పురస్కారాన్ని ప్రకటించి ఆయన భార్యకు అందజేసింది. తాజాగా.. ఆయనకు మరో గౌరవం దక్కింది. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాము రూపొందించిన కేజీఎస్‌3 శాట్‌కు దివంగత కన్నడ హీరో పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు పెట్టారు. దీనిని ఈ నెలాఖరులో తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సి54 వాహక నౌక ద్వారా పంపనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా దేశ వ్యాప్తంగా వివిధ స్కూళ్ల, కళాశాలల విద్యార్థులు రూపొందించిన 75 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.