కొనప్రాణంతో కొట్టుకుంటుంటే..సెల్ఫీల పిచ్చి ఎందో... - MicTv.in - Telugu News
mictv telugu

కొనప్రాణంతో కొట్టుకుంటుంటే..సెల్ఫీల పిచ్చి ఎందో…

July 21, 2017

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని ఎంత త్వరగా హాస్పిటల్ కు చేర్చితే అంతా మంచిది..క్షణం ఆలస్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం. తీవ్ర రక్తస్రావం అవుతున్నా..అలాగే కాసేపు వదిలేస్తే…నిండు ప్రాణం పోయినట్టే.. కాదు చూస్తూ చూస్తూ ప్రాణాలు తీసినట్టే. పుణేలో సెల్ఫీ పిచ్చిలో పడి మానవత్వాన్ని మరిచారు. రక్తమోడుతుంటే ..ఆసుపత్రికి తీసుకుపోవాల్సింది పోయి.. సోయి లేకుండా సెల్ఫీ లు తీసుకున్నారు. సెల్ఫీ పిచ్చిలో సాటి మనిషి ప్రాణాన్ని కాపాడకోలేకపోయారు.

ఇది సోయి లేని స్మార్ట్ ఫోన్ల ప్రపంచం. సెల్ఫీ సోగ్గాళ్లారా..ఎక్కడైనా సెల్ఫీ తీసుకోండి మీ ఇష్టం..కానీ శవాల ముందు ఎందిరా నాయనా..కొనప్రాణంతో కొట్టుకుంటుంటే..సెల్ఫీ క్లిక్ లు ఎందో…జర మనుషుల్ని గుర్తించకండి..మానవత్వం ఉందని గుర్తించండి.. ప్రమాదాల్లో గాయపడిన వారిని భారత పౌరులుగా ఆసుపత్రుల్లో చేర్చండి..వీలైతే మనిషి ప్రాణాలు కాపాడి..అప్పుడు సెల్ఫీ తీసుకోండి..అప్పుడు మీకే ధునియా సెల్యూట్ చేస్తుంది.

పుణే బోసారికి చెందిన టెకీ సతీశ్ బుధవారం సాయంత్రం బయటకు వెళ్లారు. భోసారిలో రోడ్డుపై వెళ్తుండగా ఓ వాహనం ఢీకొట్టింది. అతడికి ఏమైందో చూడకుండా ఆ వాహనం డ్రైవర్‌ అలాగే వెళ్లిపోయాడు. కొన్ని క్షణాల్లోనే జనం గుమిగూడారు. ఓవైపు తీవ్రంగా రక్తస్రావమవుతున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సతీశ్‌ను కాపాడాల్సింది పోయి, సోయి లేకుండా కొందరు వీడియో ,మరికొందరు గాయపడ్డ టెకీని ఫొటోలు, సెల్ఫీలు తీశారు. ఇంతలో కార్తీరాజ్ కాటే అనే డెంటిస్ట్ జరిగిన దారుణాన్ని చూసి చలించిపోయారు. కొందరి సాయంతో టెకీ సతీశ్‌ను పింపిరిలోని యశ్వంత్‌రావు చౌహాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. టెకీని చూసిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

అక్కడ ఉన్నోళ్లు సెల్ఫీ లు తీసుకోకుండా ముందే స్పందించి ఉంటే అతని ప్రాణాలు దక్కేవేమో.. ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ..ముందు సెల్ఫీలు కాదు..గాయపడిన ఎలా కాపాడాలో ఆలోచించండి..100..108 కు ఫోన్లు చేయడంతో పాటు…వారిని ఆసుపత్రుల్లో చేర్పించండి..అంతే గానీ సోయిలేకుండా సెల్ఫీలు తీసుకోవద్దు..