పబ్‌జీ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేసిన కుర్రాడు.. తల్లిదండ్రులకు షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

పబ్‌జీ కోసం రూ. 16 లక్షలు ఖర్చు చేసిన కుర్రాడు.. తల్లిదండ్రులకు షాక్

July 4, 2020

Punjab Boy Spent 16 Lakhs For Pubg

పబ్‌జీ ఆట యువతను పిచ్చివాళ్లను చేస్తోంది. చాలా మంది దీనికి బానిసలుగా మారి మతి పోగొట్టుకుంటున్నారు. ఇంకా కొంత మంది అయితే పిచ్చిగా ప్రవర్తించి ఉన్మాదుల్లా మారిపోయిన ఘటనలు చూశాం. ఈ ఆట కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. తాజాగా పంజాబ్‌లోనూ ఓ కుర్రాడు ఇలాగే చేశాడు. తల్లిదండ్రుల బ్యాంకులో దాచుకున్న రూ. 16 లక్షల సొమ్ముతో ఓ యాప్ కోసం ఖర్చు చేయడం విశేషం. ఈ విషయం తెలిసి అతని తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాని స్థితిలోకి చేరిపోయారు. 

గేమింగ్ వ్యసనానికి అలవాటుపడిన 17 ఏళ్ల ఆ కుర్రాడు తన గేమింగ్ అకౌంట్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ‘ఇన్ – యాప్’ అప్‌డేట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీని కొనుగోళు కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశాడు. తన స్నేహితులతో కలిసి ఈ యాప్ కొనుగోలు చేసి ఆడేవాడు. ఇతర ఖర్చులకు కూడా అందులోని డబ్బులే తీసుకునేవాడు. దీంతో తల్లిదండ్రుల అకౌంట్లో సొమ్ము మెల్లమెల్లగా ఖాళీ అవుతోంది. కొడుకు తీరుపై అనుమానం రావడంతో ఓ రోజు తండ్రి ఖాతా వివరాలు చూసుకోగా అసలు విషయం తెలిసింది. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా తండ్రి ఉద్యోగ రిత్యా వేరే ప్రాంతంలో ఉండగా, అతడు తల్లితో కలిసి మరో ప్రాంతంలో ఉంటున్నారు.