ఇకపై కిరాణ షాపుల్లోనూ మద్యం అమ్మకాలు  - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై కిరాణ షాపుల్లోనూ మద్యం అమ్మకాలు 

February 3, 2020

beeer01

పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాజాగా కొత్త లిక్కర్ పాలసీ తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఫారిన్/ఇంపోర్టడ్ లిక్కర్ కిరాణ షాపుల్లోనూ అమ్మనున్నారు. మద్యం తయారీ కంపెనీలు.. స్థానికంగా ఉన్న కిరాణ షాపుల యజమానులతో ఒప్పందం చేసుకుంటారు. ఆ తర్వాత షాపుల్లోనూ లిక్కర్ బాటిల్స్ అమ్ముతారు. 

ఇందుకోసం ప్రభుత్వం ఎల్2బి లైసెన్స్ ఇవ్వనుంది. గతంలో డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌లో మాత్రమే ఈ అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకపై కిరణా షాపుల్లోనూ అమ్మకాలు జరుపుతారు. ఈ కొత్త లిక్కర్ పాలసీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనికి పలు షరతులు ఉన్నాయి. షాపు 400 స్వ్కేర్ ఫీట్‌లో ఉండాలి. గ్రోసరీ, ఫ్రోజన్ గూడ్స్, షుగర్, బేకరీ, టాయ్ లెటరీస్, కాస్ మెటిక్స్, హౌస్ హోల్డ్ గూడ్స్, టాయ్స్, స్పోర్ట్స్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్, అపెరల్స్, ఆఫీస్ స్టేషనరీ, గిఫ్ట్ ఐటెమ్స్ లేదా హౌస్ హోల్డ్ గూడ్స్ విక్రయించే షాపు అయి ఉండాలి. లైసెన్స్ ఫీజుని రూ.20లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో లైసెన్స్ ఫీజు రూ.10లక్షలుగా ఉండేది. అయితే ఈ లిక్కర్ పాలసీపై మహిళలు మండిపడుతున్నారు.