Punjab Chief Minister Bhagawant Mann To Visit Telangana Today
mictv telugu

నేడు తెలంగాణకు పంజాబ్ ముఖ్యమంత్రి..

December 20, 2022

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్‌ మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు. నగరంలో జరుగనున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొననున్నారు. భగవంత్ సింగ్ మాన్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ప్రగతిభవన్‌కు ఆహ్వానించారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చర్చించనున్నారు. ఆ తర్వాత పంజాబ్‌ సీఎం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో పంజాబ్‌లోని మొహాలిలో జరిగే ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా వారిని ఆహ్వానించనున్నారు.

పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌సింగ్‌ సంధ్వాన్‌ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్‌ జైకిషన్‌ సింగ్‌ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్‌ సింగ్‌ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్‌ సింగ్‌ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు.