రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో చేసే చిత్రవిచిత్ర విన్యాసాల మీద ఎన్నో కార్టూన్లు వచ్చాయి. ఈ ఆధునిక భాషలో చెప్పాలంటే మీమ్స్లాగా అన్నమాట. కొందరు హాస్యం కోసం కాస్త వ్యంగ్యం కలిపినా, తర్వాతి కాలంలో అవన్నీ వాస్తవాలయ్యాయి. ఇప్పుడు ఈ కోవలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేరారు. రీసెంట్గా ఈయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. అయితే కరోనా సోకిందని అంతా భావించారు.
కానీ, అది ఫేక్ అని, సీఎం ఆస్పత్రిలో చేరడానికి ఇదీ కారణమంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ప్రకారం.. కొద్ది రోజుల క్రితం భగవంత్ మాన్ రాజ్యసభ ఎంపీ బాబా బల్బీర్ సింగ్ సుల్తాన్ పూర్ లోధీలో చేపట్టిన కాళీబెన్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఉన్న నీరు శుభ్రంగా ఉందనే సంకేతం పంపించడానికి సీఎం ఓ గ్లాసు మురుగు నీరు తీసుకొని అందరి ముందే పార్టీ సభ్యుల నినాదాల మధ్య తాగారు. ఇది జరిగిన వారం తర్వాతే ఆయన కడుపు నొప్పితో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. పరిశీలించిన డాక్టర్లు ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు. అయితే దానికి కారణం నీరేనా? అనేది తేలాల్సి ఉంది.
ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਦੀ ਚਰਨ ਛੋਹ ਪ੍ਰਾਪਤ ਧਰਤੀ ਸੁਲਤਾਨਪੁਰ ਲੋਧੀ ਵਿਖੇ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਦਾ ਪਾਣੀ ਪੀਂਦੇ ਹੋਏ CM @BhagwantMann ਜੀ
ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਨੂੰ ਸਾਫ਼ ਕਰਨ ਦਾ ਬੀੜਾ ਰਾਜ ਸਭਾ ਮੈਂਬਰ ਸੰਤ ਸੀਚੇਵਾਲ ਜੀ ਨੇ ਚੁੱਕਿਆ ਹੋਇਆ ਹੈ pic.twitter.com/4LnU0U66wQ
— AAP Punjab (@AAPPunjab) July 17, 2022