నిరుద్యోగులకు పంద్రాగస్ట్ కానుక.. 6 లక్షల ఉద్యోగాలకు..  - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు పంద్రాగస్ట్ కానుక.. 6 లక్షల ఉద్యోగాలకు.. 

August 15, 2020

Punjab CM Amarinder Singh vows to provide 6 lakh jobs in two years

పంద్రాగస్ట్ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఆ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. నిరుద్యోగులకు 6 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో ప్రభత్వ రంగంలో ఒక లక్ష ఉద్యోగాలు, ప్రైవేట్‌ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఎగరేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం ‘ఘర్‌ ఘర్‌ రోజ్‌గార్‌’ పథకం ద్వారా 13 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించామని, భూమి లేని రైతులు, కూలీలకు రూ.520 కోట్లు కేటాయించామని తెలిపారు. 

కౌలు రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం త్వరలోనే కొత్త చట్టాన్ని ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టంచేశారు. జాతీయ రహదారుల కల్పనకు రాబోయే రెండేళ్లలో రూ.12 వేల కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. మరోవైపు కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంతో సేవలు అందిస్తున్నారని ఆయన వారి సేవలను గుర్తు చేసుకున్నారు.