రేపు రెండో పెళ్ళి చేసుకోనున్న ముఖ్యమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

రేపు రెండో పెళ్ళి చేసుకోనున్న ముఖ్యమంత్రి

July 6, 2022

పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ (49) గురువారం పెళ్లి చేసుకోనున్నారు. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతిని రెండో వివాహం చేసుకోబోతున్నారు. రాజధాని చండీగఢ్‌లో అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి జరుగనుంది. ఈ వివాహానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ రాజకీయ ప్రముఖులు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. కాగా, భగవంత్ మాన్ మొదట ఇంద్రప్రీత్ కౌర్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, ఒక బాబు సంతానం. ఆరేళ్ల తర్వాత 2015లో వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత రాజకీయాలలో బిజీ అయిన భగవంత్.. పంజాబ్ సీఎం స్థాయికి ఎదిగారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనే రెండో పెళ్లి చేసుకోనున్నారు. ఈ మేరకు వార్తా సంస్థ ఏఎన్ఐ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.,