Home > Featured > కరోనాపై సీఎం టిక్‌టాక్.. ఉల్లంఘనులను పట్టించే చిన్నారితో

కరోనాపై సీఎం టిక్‌టాక్.. ఉల్లంఘనులను పట్టించే చిన్నారితో

Punjab CM Teams Up with 5-year-old Tiktok Star to Talk About Social Distancing

కరోనాను నియంత్రించేందుకు మన వద్ద ఉన్న ఏకైక ఆయుధం ఇళ్లల్లో ఉండటం. దీనిని కొందరు మంచి ఛాన్స్ అని భావించి ఎంచక్కా ఇళ్లల్లో కుటుంబాలతో ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తిరుగుళ్లు తప్పాయని తెగ ఫీలైపోతున్నారు. ఏదో వంకతో బయట కాలు మోపి కాళ్లకున్న బంధనాలను తెంచుకోవాలని తెగ ఉబలాటపడుతున్నారు. ఇలాంటివాళ్లకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ టిక్‌టాక్ వేదికగా చక్కగా బుద్ధి చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చాలమందిని ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో.. మోగాకు చెందిన ఐదేండ్ల నూర్‌ప్రీత్ కౌర్ అనే అమ్మాయి అబ్బాయిలా కనిపించింది. కొంతమంది గ్రామస్తులు కర్ఫ్యూ సడలింపు సమయంలో క్రికెట్ ఆడేందుకు బయటకు వచ్చారు. వారిని చూసిన అబ్బాయి గెటప్‌లో ఉన్న సదరు అమ్మాయి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఎంతకీ వాళ్లు వినకపోయేసరికి ముఖ్యమంత్రికే వీడియో కాల్ చేస్తాడు. గ్రామస్తుల యవ్వారాన్ని డైరెక్టుగా ముఖ్యమంత్రికే చేరవేస్తాడు. అప్పటివరకు ఆ బాబు మాటలను అస్సలు పట్టించుకోరు. పొట్టి బుడంకాయ సీఎంకు కాల్ చేస్తాడా? అనుకుని నవ్వుకున్నారు. తర్వాత వీడియోలో ముఖ్యమంత్రిని చూసి షాక్ అవుతారు. ముఖ్యమంత్రి కూడా తనదైన శైలిలో వారికి బాగా చివాట్లు పెడుతారు. దీంతో కిమ్మనకుండా ఇంటి దారి పడతారు వారంతా. కాగా, ఇలాంటి తిరుగుబోతుల గురించి ముఖ్యమంత్రి టిక్‌టాక్ యాప్ ద్వారా అనుసరించిన తీరు చాలా బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పైగా ఈ వీడియోలో చిన్నారి చాలా బాగా నటిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 11 May 2020 8:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top