దళితుడికి మూత్రం తాగించి.. గాయాలతో మృతి - MicTv.in - Telugu News
mictv telugu

దళితుడికి మూత్రం తాగించి.. గాయాలతో మృతి

November 16, 2019

దేశంలో కులవివక్ష ఏ స్థాయిలో ఉందో చెప్పే ఉదంతం ఇంది. మాటలతో రేగిన వివాదం ఓ దళితుడిని బలితీసుకుంది. అతనికి బలవంతంగా మూత్రం తాగించి, దారుణంగా కొట్టి చంపారు. పంజాబ్‌లోని సంగ్‌రుర్ జిల్లా చంగలివాలా గ్రామంలో ఈ దారుణం జరిగింది. 

Punjab

37 ఏళ్ల జగ్మేల్ సింత్ అనే వ్యక్తిని గత నెల 21న గ్రామానికే చెందిన రింకు అనే వ్యక్తితో గొడవ జరిగింది. పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. అయితే రింకు తర్వాత మళ్లీ దళితుణ్ని తన ఇంటికి రమ్మని పిలిచాడు. జగ్మేల్ రాగానే స్నేహితులతో కలసి స్తంభానికి కట్టేసి దాడి చేశాడు. జగ్మేల్ దాహంతో నీళ్లు ఇవ్వాలని కోరగా మూత్రం పోసి బలవంతంగా తాగించారు. తీవ్రంగా కొట్టి వదిలేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతణ్ని చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ రోజు(శనివారం) ఉదయం చనిపోయాడు. ఈ ఘటనపై రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ మండిపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది.