రైతుల ఆందోళన.. రైలు పట్టాలపై టెంట్లు వేసి.. - MicTv.in - Telugu News
mictv telugu

రైతుల ఆందోళన.. రైలు పట్టాలపై టెంట్లు వేసి..

September 27, 2020

Punjab Farmers Begin 3-Day Protest Against Farm Bills, Block Rail Tracks.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను అటు ప్రతిపక్షాలు, ఇటు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులతో తాము తీవ్రంగా నష్టపోతామని, వాటిని వాపసు తీసుకోవాలని దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగుతున్నారు. పంజాబ్, హరియాణాలో ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తోంది. అయితే బిల్లులతో ఎవరికీ నష్టం లేదని బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధ్వర్యంలో రైతులు రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు. అమృత్‌సర్ ఏరియాలోని దేవీదాస్‌పుర గ్రామంలో రైతులు రైలు పట్టాలపై టెంట్లు వేసుకుని కూర్చుని రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. 

కాగా, నిన్న బిహార్ రాజధాని పట్నాలో జరిగిన రైతుల నిరసన ర్యాలీపై బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న వారు దాడి చేశారు. ర్యాలీ వాహనాన్ని అడ్డుకుని కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో పలువరికి గాయాలు అయ్యాయి. జన్ అధికార్ పార్టీ(జేఏపీ) నేత రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ఈ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ వీరచంద్ పాటిల్ రోడ్డుని బీజేపీ కార్యాలయం మీదుగా వెళ్తుండగా కొందరు దాడి చేశారు. ‘నరేంద్ర మోదీ జిందాబాద్‘, ‘బీజేపీ జిందాబాద్’ అని గట్టిగా కేకలు వేశారు.