Punjab: Ferozepur police constable wins Rs.1-crore lottery
mictv telugu

రూ.6 తో లాటరీ టికెట్‌.. కోటీశ్వరుడైన కానిస్టేబుల్

August 4, 2022

 

కేవలం ఆరు రూపాయలతో లాటరీ టిక్కెట్ కొని కోటి రూపాయలు గెలుచుకున్నాడో కానిస్టేబుల్. కలసి వచ్చిన ఈ అదృష్టానికి ఆనందంతో సంబరపడిపోతున్నాడు. పంజాబ్ లూధియానా జిల్లాలోని గంగానగర్కు చెందిన కుల్దీప్ సింగ్ ది పేద కుటుంబం. తల్లి ఎంతో కష్టపడి చదివించగా ప్రయోజకుడై కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. ఈ క్రమంలోనే ఓ రోజు అతని తల్లి సూచనతో కొన్ని లాటరీ టికెట్లు కొన్నాడు. అందులో ఆరు రూపాయలు పెట్టి కొన్న లాటరీ కూడా ఉంది. ఇప్పుడు అదే ఆయన్ను కోటీశ్వరుడిని చేసింది.

కుల్దీప్ మరో లాటరీ కూడా గెలుచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కుల్దీప్తో పాటు ఆయన తల్లి పట్టరాని సంతోషంలో మునిగి తేలుతున్నారు.ఈ టికెట్ను ‘లూధియానా గాంధీ లాటరీ’ షాపు యజమాని విక్రయించారు. గడిచిన మూడు నెలల్లో రూ.3కోట్ల విలువైన లాటరీలను.. లబ్ధిదారులకు అందించినట్లు ఆయన తెలిపారు. ‘ఖరీదైన లాటరీలు కొనాలని మేం ఎవరినీ బలవంతం చేయం. తక్కువ ధర ఉన్న లాటరీలను ప్రయత్నించి అదృష్టం పరీక్షించుకోవాలని చెబుతుంటాం. మా ద్వారా కొన్ని కుటుంబాలు పేదరికం నుంచి బయటపడుతున్నాయి. దానికి చాలా ఆనందంగా ఉంది’అని లాటరీ దుకాణ యజమాని చెబుతున్నారు.