24 గంటలే గడువు.. తబ్లిగీకి డెడ్‌లైన్ - MicTv.in - Telugu News
mictv telugu

24 గంటలే గడువు.. తబ్లిగీకి డెడ్‌లైన్

April 7, 2020

తప్పు చేసినోడు దాక్కోవాలి కానీ, జబ్బు చేసినోడు కాదు కదా. మిమ్మల్ని తీసుకెళ్లేది చంపడానికి కాదు.. బతికించుకోవడానికి అని ప్రభుత్వ అధికారులు ఎంత మొత్తుకున్నా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్‌కు వెళ్లి వచ్చినవారు వినడం లేదు. అనవసర పుకార్లను నమ్మి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. వారితో పాటు ఇతరులకు కరోనా అంటించి దేశంలో కరోనా వ్యాప్తిలో భాగం అవుతున్నారు. ఈ నేేపథ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ వెళ్లివచ్చి రహస్యంగా ఉంటున్న తబ్లిగి జమాత్ కార్యకర్తలకు పంజాబ్ ఆరోగ్య శాఖ 24 గంటల డెడ్‌లైన్ విధించింది. రేపటిలోగా వారంతా పోలీసుల ముందుకు వచ్చి రిపోర్టు చేయాలనీ.. లేదంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేసింది.

తబ్లిగి కార్యకర్తలంతా 24 గంటల్లోగా కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. మొత్తం 467 మంది తబ్లిగి జమాత్ కార్యకర్తలు నిజాముద్దీన్ నుంచి పంజాబ్ రాగా.. అందులో 445 మందిని పోలీసులు గుర్తించారు. కాగా మరో 22 మంది ఎక్కడున్నారో ఇంకా తెలియరాలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.