ఆప్ కొత్త సీఎం సంచలనం.. అవినీతి మంత్రి ఔట్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆప్ కొత్త సీఎం సంచలనం.. అవినీతి మంత్రి ఔట్

May 24, 2022

తన కేబినెట్‌లోని ఆరోగ్య శాఖ మంత్రి అవినీతికి పాల్పడ్డారన్న విషయం తెలిసి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వెంటనే చర్యలు తీసుకున్నారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజ‌య్ సింగ్లాపై అవినీతి ఆరోప‌ణ‌లు రావ‌డంతో, మంత్రి ప‌ద‌వి నుంచి తొలగించి, వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని ఆదేశించారు.దీంతో ఏసీబీ వెంట‌నే విజ‌య్ సింఘాల్‌ను అరెస్ట్ చేసింది.

ఈ విష‌యంపై సీఎం భ‌గ‌వంత్ మాన్ స్పందిస్తూ… మంత్రి విజ‌య్ సింఘాల్‌ అవినీతికి పాల్పడ్డారు. అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ఆయ‌న కూడా అంగీక‌రించారు. దీంతో ఆయ‌న్ను కేబినెట్ నుంచి తొల‌గించి, క‌ఠిన‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నాను. ఆయ‌న‌పై కేసు నమోదు చేయాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశానని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించ‌దు అని సీఎం భ‌గ‌వంత్ మాన్ స్ప‌ష్టం చేశారు.