తండ్రి చేతిలో చావుదెబ్బలు తిన్న ధావన్ - MicTv.in - Telugu News
mictv telugu

తండ్రి చేతిలో చావుదెబ్బలు తిన్న ధావన్

May 26, 2022

ఈ ఏడాది ఐపీఎల్‌లో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పీబీకేఎస్(పంజాబ్ కింగ్స్).. ప్లేఆఫ్స్ చేరకుండానే నిష్క్రమిచింది. కెప్టెన్లు మారినా ఆటగాళ్లు మారినా ఆ జట్టు రాత మారకపోవడంతో పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆ జట్టులో ఓపెనర్‌గా ఉన్న గబ్బర్ అలియాస్ శిఖర్ ధావన్‌.. మొత్తం 14 మ్యాచుల్లో 38.33 సగటుతో 460 పరుగులు చేసినా తన జట్టును ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు. దీంతో స్వగ్రామానికి చేరుకున్న గబ్బర్.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. ’ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై కాకుండా ఇంటికి తిరిగి వచ్చినందుకు మా నాన్న ఇలా కొడుతున్నాడంటూ…’ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.

 

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

వీడియోలో శిఖర్ ధావన్ తండ్రి మోహిందర్ పాల్ ధావన్, శిఖర్ ధావన్‌పై చేయి చేసుకున్నట్టుగా, కాలితో తన్నుతున్నట్టుగా నటిస్తూ జీవించేశారు. దానికి ఓ పాత బాలీవుడ్‌ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్‌ వాయిస్‌ జత చేసి షేర్ చేశాడు. ధావన్ కింద పడిపోయినా ఆయన తండ్రి కొట్టుకుంటూ కుమ్మేయడం చూసి ఫ్యాన్స్ నవ్వుకుంటుకున్నారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూస్తే నిజంగానే ధావన్‌పై ఆయన తండ్రి దాడి చేసినట్లుగా ఉంది.