PUNJAB KINGS EYES KANE WILLIAMSON IN MINI AUCTION 2023
mictv telugu

కేన్ విలియమ్సన్‌పై‎ ఆ జట్టు కన్ను..ఎన్ని కోట్లైనా వదిలేది లేదు..

November 18, 2022

ఐపీఎల్ -2023 మిని వేలానికి సుమారు ఇంకో నెల రోజుల సమయం ఉంది. ఇప్పటికే జట్లు తమకు అవసరమనుకున్న ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకొని మిగిలిన వారిని వేలానికి విడుదల చేశాయి. గతంలో కోట్లకు అమ్ముడపోయి విఫలమైన కీలక ఆటగాళ్లను సైతం వదిలించుకున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ తమ కెప్టెన్ కేన్ విలియమ్స్‌న్‌తో పాటు భారీ ధరకు కొన్న నికోలస్ పూరన్, షెఫర్డ్‌లను రిలీజ్ చేసింది

గత ఐపీఎల్ వేలానికి ముందు సన్‌రైజర్స్ రూ.14 కోట్లకు కేన్‌ విలియమ్సన్‎ను రిటైన్ చేసుకుంది. అయితే అతడు బ్యాటింగ్‌లో విఫలమవ్వడంతో పాటు కెప్టెన్‌గా రాణించలేకపోయాడు. మనుపటి దూకుడు, ఫామ్ కేన్‌లో ప్రస్తుతం కనిపించకపోవడంతో సనరైజర్స్ అతనిని వదులుకుంది.

వేలంలోకి వచ్చిన కేన్ విలియమ్స్‌న్‌పై ఓ జట్టు కన్నేసినట్టు తెలుస్తోంది. ఎన్నికోట్లైన పెట్టి విలియమ్స్‌ను దక్కించుకోవాలని పంజాబ్ కింగ్స్ భావిస్తుందంట. ఆ టీమ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను వదులుకోవడంతో విలియమ్సన్‌ను సొంతం చేసుకుని తమ కెప్టెన్‌గా నియమించుకోవాలని చూస్తుందని సమాచారం. పంజాబ్ వద్ద సుమారు 32 కోట్లు ఉండడంతో 10 కోట్లు పెట్టైనా విలియమ్స్‌ను కొనేస్తుందని వార్తలు వస్తున్నాయి.