ఐపీఎల్ ప్లేఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ చేతులెత్తేసింది. చెత్త బ్యాటింగ్‌తో కేవలం 73 రన్స్‌కే ఆలౌటై.. చేజేతులా ఓడింది. దీనిపై ఆ టీమ్ కోచ్ వీరేందర్ సెహ్వాగ్ ఫైర్ అయ్యాడు. ముఖ్యంగా టీమ్‌లోని విదేశీ ప్లేయర్స్‌నే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశాడతడు.
బాధ్యతగా ఆడాల్సిన గప్టిల్, మ్యాక్స్‌వెల్, మార్ష్, మోర్గాన్.. కనీసం 12 నుంచి 15 ఓవర్లు కూడా క్రీజులో లేకపోవడం దారుణమని వీరూ అన్నాడు. ఇలా ఓడిపోవడం తనకు చాలా బాధగా ఉందని అతను చెప్పాడు. వికెట్ స్లోగా ఉందని వాళ్లు సాకులు చెబుతున్నారు. కానీ ఇంతలా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ ఇలాంటి వికెట్స్‌కు అలవాటు పడాలి. అయినా ఎలాంటి వికెట్ దొరికినా నీ టీమ్ కోసం 20 ఓవర్లు కూడా ఆడకపోతే ఎలా అని అతను ప్రశ్నించాడు. గప్టిల్ ఓపెనర్‌గా రావడం హిట్ చేయడానికే. అలాంటి బ్యాట్స్‌మన్ తొందరగా ఔటవడంలో ఎలాంటి తప్పులేదు. మిగతా బ్యాట్స్‌మెన్ అయినా నిలదొక్కుకోవాల్సింది అని వీరూ అన్నాడు.
మ్యాక్స్‌వెల్, మోర్గాన్లాంటి అనుభజ్ఞులు మరీ ఇంత చెత్తగా ఆడటం ఏమీ బాగాలేదని అతను చెప్పాడు. అసలు మ్యాక్స్‌వెల్ టోర్నీలో ఏ మ్యాచ్‌లోనూ కెప్టెన్‌గా సరైన బాధ్యత తీసుకోలేదని విమర్శించాడు.
HACK:
- Punjab Kings team coach Veerenda Sehwag fires on their bad performance.
- Punjab Kings team missed the chance to play in IPL playoffs.