Punjab mp simranjit singh controversial statement on bhagat singh in karnal Haryana
mictv telugu

‘భగత్‌ సింగ్‌ ఉగ్రవాదా? కాదా?’.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

July 15, 2022

Punjab mp simranjit singh controversial statement on bhagat singh in karnal Haryana

భగత్‌సింగ్ ఉగ్రవాదిగా సంభోదిస్తూ సాక్షాత్తూ ఓ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు విసిరాడని , సిక్కు మతానికి చెందిన కానిస్టేబుల్‌ను చంపాడంటూ పంజాబ్ కు చెందిన సిమ్రన్‌జిత్‌ సింగ్‌ మాన్‌(77) అనే పార్లమెంట్ సభ్యుడు కామెంట్లు చేశాడు. శిరోమణి అకాళీ దళ్‌ పార్టీ నేత, సంగ్రూర్ నిజయోకవర్గ ఎంపీ అయిన సిమ్రన్‌జిత్‌… భగత్‌ సింగ్‌ యువకుడైన ఓ ఇంగ్లీష్‌ అధికారిని చంపాడని, సిక్కు కానిస్టేబుల్‌ ఛన్నన్‌ సింగ్‌నూ హతమార్చాడని అన్నాడు. జాతీయ అసెంబ్లీలో బాంబు విసిరాడని చెబుతూ.. భగత్‌ సింగ్‌ ఉగ్రవాదా? కాదా? అంటూ నోరుజారాడు. ఖలిస్థానీ అనుకూల వ్యాఖ్యలు చేసే క్రమంలో.. ఇలా కామెంట్లు చేశాడు.

ఈ వ్యాఖ్యలపై ఆప్‌ ప్రభుత్వం సీరియస్ అయింది. ఎంపీ వ్యాఖ్యలను హేయనీయమైన, సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించింది. మనోభావాలు దెబ్బతీసేలా, ఒక వీరుడ్ని అగౌరవపరిచేలా మాట్లాడినందుకు సిమ్రన్‌జిత్‌ యావత్‌ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది.