ఇది చదివితే కన్నీళ్లు ఆగవు... - MicTv.in - Telugu News
mictv telugu

ఇది చదివితే కన్నీళ్లు ఆగవు…

July 15, 2017

ఇదేనేమో కలికాలం అంటే..స్పీడ్ యుగంలోకి ఎంటరైనా మూర్ఖపు ఆలోచనలు మాత్రం మారడం లేదు. మారే యుగంతో పాటు అవి పోటీపడుతున్నట్టు ఉంది. అన్నింటికి ఆడది కావాలి గానీ ..కూతర్ని కంటే మాత్రం కొందరికి కోపం కట్టలు తెగుతోంది. ఆడపిల్ల పుట్టిందని హాకీ స్టిక్స్‌తో మహిళను ఆమె భర్త సోదరుడు చితకబాదాడు.. ఈ హృదయ విదారక ఘటన పంజాబ్‌లోని పాటియాలలో జరిగింది.

మీనా కశ్యప్ కు దల్జీత్ సింగ్ తో రెండేళ్ల కింద పెళ్లి అయింది.పెళ్లైన కొన్నాళ్లకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. కట్నం ఎంతిచ్చినా ఇంకా కావాలంటూ అత్తింటివాళ్లు వేధించారు.మాటలతో నిత్యం నరకం చూపారు. దీంతో వేరు కాపురం పెట్టారు. అయినా.. అత్తింటివారి వేధింపులు ఆగలేదు. ఈ మధ్యే మీనా కశ్యప్ ఆడపిల్ల పుట్టింది. అంతే ఆమె భర్త సోదరుడు, అతడి మిత్రుడు కలిసి ఆమెను హాకీ స్టిక్స్‌తో ఇంటి ఆవరణలోనే చితకబాదారు. వదిలేయండి అని ఆమె ఎంత ప్రాధేయపడినా వినలేదు. చుట్టుపక్కల వారు ఆపేందుకు ప్రయత్నించలేదు. పైగా ఆమెను కొడుతుండగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇలాంటివాళ్లను బహిరంగంగా ఉరితీయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

https://www.youtube.com/watch?v=EvlvtpqXCeQ