Punjab Speaker's reaction on Amit Shah - NTR meeting
mictv telugu

అమిత్ షా – ఎన్టీఆర్ భేటీపై పంజాబ్ స్పీకర్ స్పందన

August 22, 2022

కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్‌ల భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. మునుగోడు సభ ముగిసిన అనంతరం ఆదివారం రాత్రి వీరిద్దరి భేటీ జరిగింది. దాదాపు 20 నిమిషాలు ఈ భేటీ జరుగగా, తర్వాత కలిసి డిన్నర్ చేశారు. భేటీ అనంతరం అమిత్ షా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రతిభావంతుడైన ఎన్టీఆర్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అటు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు గానీ, సినిమా రంగానికి చెందిన వారు గానీ ఇంతవరకూ ఎవరూ స్పందించలేదు. కానీ, ఈ అంశంతో ఏ మాత్రం సంబంధం లేని పంజాబ్ స్పీకర్ కుల్తర్ సింగ్ సంధ్వాన్ స్పందించారు. ఆయన ఆప్ పార్టీకి చెందిన వాడు కావడం గమనార్మం. ఆయన ట్విట్టర్‌లో ‘తారక్.. గొప్పవాడైన ఎన్టీ రామారావు గారి వారసత్వాన్ని కొనసాగించు, బతికించు’ అని పేర్కొన్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. అయితే వీరి భేటీ వెనుక రాజకీయ కారణాలు మాత్రం ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. సినీ, రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం, బలమైన సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో బీజేపీ ఎన్టీఆర్‌తో సాధించే రాజకీయ ప్రయోజనాలు ఏ రకంగా ఉండునున్నాయన్న విషయం ఆసక్తిగా మారింది. అటు ఎన్టీఆర్ అభిమానులు కూడా తాజా పరిణామాలపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.