విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు! - MicTv.in - Telugu News
mictv telugu

విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు!

August 11, 2020

Punjab To Give Smartphones To Students

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు వేసేసిన సంగతి తెల్సిందే. దీంతో కొన్ని విద్యా సంస్థలు ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. అయితే, కొందరు విద్యార్థులు మొబైల్ ఫోన్స్ లేకపోవడంతో ఆన్ లైన్ తరగతులను వినలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 12వ తరగతి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు అందించనున్నట్లు ప్రకటించింది. 

పంజాబ్‌ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 12న యువత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. పేద విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్ సింగ్ తెలిపారు. ఈ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టనున్నట్లు పంజాబ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటి దశలో సుమారు 1.75 లక్షల ఫోన్‌లు ఇవ్వనున్నట్లు వెల్లడించాయి.