రెండో సూపర్ ఓవర్‌లో పంజాబ్ విజయం - MicTv.in - Telugu News
mictv telugu

రెండో సూపర్ ఓవర్‌లో పంజాబ్ విజయం

October 19, 2020

nvhmnghm

ఆదివారం పంజాబ్-ముంబై జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. ఒకటి కాదు ఏకంగా రెండు సూపర్ ఓవర్లు ఆడితే తప్ప మ్యాచ్ ఫలితం రాలేదు. ముంబై-పంజాబ్ మ్యాచ్‌ టై కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లోనూ టై కావడంతో మరో సూపర్ ఆడాల్సి వచ్చింది. ఇలా జరగడం బహుశా ఇదే తొలిసారని ఐపీఎల్ అభిమానులు అభిప్రాయం పడుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. డికాక్ 53, కృనాల్ పాండ్యా 34, పొలార్డ్ 34 పరుగులు చేయడంతో ముంబై 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దిగిన పంజాబ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. 

దీంతో మ్యాచ్ టై అయింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 77, క్రిస్ గేల్ 24, పూరన్ 24 పరుగులు చేశారు. మ్యాచ్ టై కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఆరు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 5 పరుగులు మాత్రమే చేసింది. 6 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు షమీ బౌలింగ్ తట్టుకోలేక 6 పరుగులే చేసింది. దీంతో మ్యాచ్ మరోమారు టై అయింది. ఫలితంగా విజేతను తేల్చేందుకు మరో సూపర్ ఓవర్ అనివార్యమైంది. రెండో సూపర్‌లో ముంబై పొలార్డ్, పాండ్యాలను బరిలోకి దింపింది. జోర్డాన్ కట్టుదిట్టమైన బౌలింగు ముందు పరుగులు చేయలేకపోయారు. వికెట్ నష్టానికి 11 పరుగులు మాత్రమే చేసింది. 12 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆటగాళ్లు గేల్‌, అగర్వాల్‌ పంజాబ్ జట్టుని విజయ తీరాలకు చేర్చారు.