గాయకుడికిపైకి తూటాలు.. నేనే కాల్చానన్న గ్యాంగ్‌స్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

గాయకుడికిపైకి తూటాలు.. నేనే కాల్చానన్న గ్యాంగ్‌స్టర్

April 14, 2018

ప్రముఖ పంజాబ్  గాయకుడు పర్మిష్ వర్మపై గుర్తు తెలియని వ్యక్తులు  కాల్పులు జరిపారు. వర్మ శుక్రవారం ఇంటికి వెళ్తున్న సమయంలో మొహాలీలోని సెక్టర్ 91 వద్ద  దుండగులు తుపాకీతో కాల్చారు. అతనికి కాలి భాగంలో బుల్లెట్ దిగి, తీవ్ర రక్తస్రావం అయింది. పర్మిష్‌ను గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన  కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.పర్మిష్‌ వర్మ ‘గాల్ నహీన్ కదానే’ అనే పంజాబీ పాటతో ఒక్కసారిగా  ఫేమస్ అయ్యాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్లు పర్మిష్‌పై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. తానే కాల్చాలని  పంజాబ్‌లో మోస్ట్ వాంటెడ్ అయిన దిల్ ప్రత్ సింగ్ దహాన్ చెప్పాడు. ఈ మేరకు దిల్ ప్రీత్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశాడు. అలాగే తుపాకీ పట్టుకున్న ఉన్న ఫోటోనూ పోస్ట్ చేశాడు.  ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఈ గ్యాంగ్‌స్టర్ పై పలు కేసులు ఉన్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు స్పందించలేదు. ఈ కేసు విచారణలో ఉందని తెలిపారు.