అవినీతి నిర్మూలనకు పంజాబ్ కొత్త సీఎం సంచలన నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

అవినీతి నిర్మూలనకు పంజాబ్ కొత్త సీఎం సంచలన నిర్ణయం

March 17, 2022

nnn

సామాన్యుల పార్టీగా పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిన ఆప్ పార్టీ అందుకనుగుణంగానే తన చర్యలను ప్రారంభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భగవంత్ మాన్ గురువారం సంచలన ప్రకటన చేశారు. అవినీతి నిర్మూలనకు భగత్ సింగ్ వర్ధంతి రోజున (మార్చి 23) అవినీతి నిరోధక హెల్ప్‌లైన్ నెంబర్‌ను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే ఆడియో లేదా వీడియో తీసి పంపాలని సూచించారు. హెల్ప్‌లైన్ నెంబర్‌గా తన వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ ఉంటుందని వెల్లడించారు. పంజాబ్‌లో అవినీతి ఇక నడవదనీ, అలాంటి అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ట్విట్టర్‌లో హెచ్చరించారు. కాగా, ఇటీవల జరిగిన పంజాబ్ ఎన్నికల్లో ఆప్ పార్టీ 117 సీట్లకు గాను, 92 సీట్లతో ఘన విజయం సాధించింది. చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరుండాలనే నిర్ణయాన్ని ప్రజలకే వదిలేసి, వారు మెచ్చిన భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రిగా నియమించింది.