పూరీ ఏంటా మాటలు... - MicTv.in - Telugu News
mictv telugu

పూరీ ఏంటా మాటలు…

August 1, 2017

పూరీ జగన్నాథ్  లెజెండ్ బాలకృష్ణకు పెద్ద ఫ్యాన్ అయినట్లుంది. అంతేకాదు బాలకృష్ణ అభిమాన సంఘం తమ గల్లీలో ఉంటే గనుక దానికి  తానే అధ్యక్షున్ని అవుతానని  అంటున్నారు. పైసా వసూల్ సిన్మ బాలయ్య బాబుగారితో పూరి జగన్నాథ్ చేశారు.  ఇన్నాళ్లు బాలయ్యతో ఎందుకు సిన్మా తీయలేదని బాధపడుతున్నానని అంటున్నారు. అయినా బాలకృష్ణ లోపల అంత ఆకట్టుకునే గుణం ఏ  కన్పించిందో పూరి గారికి.  సిన్మ వాళ్లు చాలా మటుకు హిరోలను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. పూరి కూడా అలాంటి కోవకు చెందిన వాడా అంటే అదీ కాదు. బాలయ్య బాబు డేరింగ్ గా   బోల్డ్ గా ఉంటారు కాబట్టి అదే ఆయనకు బాగా నచ్చి ఉండొచ్చని కొందరు సినీ ఫీల్డ్ వారు చెప్తున్నారు. ఇప్పటి వరకు యంగ్ అండ్ ఎనర్జీ టిక్ హిరోలతో  హిట్లు కొట్టిన పూరికి నందమూరి నట సింహాం నటకే ఫిదా అయ్యారో లేక పోతే ఫిల్మనగర్ టాక్ ప్రకారం ఆయన బోల్డ్ తనమే నచ్చిందో తెలియదు కాని బాలకృష్ణ అనగానే అహా…ఓహో అంటున్నారు.

అయితే పైసా వసూలు సిన్మా ప్రమోషన్ ను  విభిన్నంగా  జనంలోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లుంది. అందుకే మిగతా సిన్మా ప్రమోషన్ల కంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. నిజంగానే మూవీ సూపర్బ్ గా ఉంటుందనే అంచానాలు వేసుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య ఫాన్స్ కు పండగే పండగ అని చెప్పుకుంటున్నాయి సినీ వర్గాలు. పూరీకే  సిన్మా రంగంలోనే కాదు బయట కూడా  పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయనే ఒరికి ఫ్యాన్ అయ్యారంటే బాలయ్య మజాకా మరి.