మహేష్ ప్లేస్‌లో విజయ్.. కన్‌ఫార్మ్ చేసిన స్టార్ డైరెక్టర్ - MicTv.in - Telugu News
mictv telugu

మహేష్ ప్లేస్‌లో విజయ్.. కన్‌ఫార్మ్ చేసిన స్టార్ డైరెక్టర్

March 29, 2022

rrrrrrrr

హీరోల క్యారెక్టరైజేషన్ కొత్తగా చూపించడంలో పూరి జగన్నాధ్‌ది ప్రత్యేక శైలి. ఆయన కథల్లో హీరోల పాత్రలు చాలా దూకుడుగా ఉంటాయి. అలాగే సినిమాను వేగంగా చిత్రీకరించడంలో దిట్ట. పూరి ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ అనే సినిమాను రూపొందిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చే ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలవుతుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా, ఈ సినిమా తర్వాత వెంటనే ఇదే కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని పూరి కన్‌ఫార్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసి 2023 ఆగస్టు 3న విడుదల తేదీ కూడా ప్రకటించేశారు. ఈ సినిమా ఇంతకు ముందు మహేష్ బాబుతో తీయాలనుకున్న ‘జనగణమన’ కథేనన్న అనుమానం కలుగుతోంది. ఇటీవల ఆ చిత్ర పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. అందులో జనగణమన అనే అర్థం వచ్చేలా ఆంగ్ల అక్షరాలు ఉన్నాయి. దాంతో మహేశ్‌ తిరస్కరించిన కథతోనే విజయ్ దేవరకొండతో తీస్తున్నారనే అనుమానం మరింత బలపడింది.