పూరీ మాట !! - MicTv.in - Telugu News
mictv telugu

పూరీ మాట !!

July 16, 2017

సినిమాలు తియ్యటంలో పూరీ జగన్నాథ్ చాలా స్పీడు. తనకు సినిమా ధ్యాస తప్ప వేరే ప్రపంచం తెలీనంత బిజీగా వుంటాడు. తన మీద వస్తున్న డ్రగ్స్ ఆరోపణలపై చాలా కూల్ గా స్పందించాడు పూరి. నామీద వస్తున్న వివాదాలపై ఇప్పుడు నేను స్పందించేంత ఫ్రీగా లేను ‘ పైసా వసూల్ ’ సినిమా షూటింగులో బాగా బిజీగా వున్నానని చెప్పుకొచ్చాడు. ఆ సినిమా పూర్తయిన తర్వాతే ముందుకొచ్చి మాట్లాడతాడేమో. తరుణ్, నవదీప్ లాంటివాళ్ళంతా ముందుకొచ్చి మాకేం ప్రమేయం లేదన్నట్టే మాట్లాడారు. పూరీ వుంతు మిగిలుందని అనుకున్నారు. ఆయన ట్విట్టర్ లో చాలా కూల్ గా తన పని తాను చేస్కుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. చూడాలి మరి పూరీ పైసా వసూల్ సినిమా షూటింగ్ ముగించుకొచ్చి డ్రగ్స్ తో తనపై వస్తున్న ఆరోపణల మీద ఎలా స్పందిస్తాడో ?